పట్టభద్రులంతా ఓటును నమోదు చేసుకోవాలి

జనగామ జిల్లా డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

పట్టభద్రులంతా ఓటును నమోదు చేసుకోవాలి.

– ఓటర్ నమోదుకు ఫిబ్రవరి 6వరకి చివరి తేదీ.

-డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

జనవరి 27, నల్లా సమాచార్ న్యూస్ / జనగామ : ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నికల కోసం అర్హులైన వారు ఫిబ్రవరి 6వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఇంతకు ముందు ఓటు వేసిన వారు కూడా తిరిగి దరఖాస్తు చేసుకోవాలని జనగామ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేయజేశారు. రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరచిన వాళ్ళకే మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఓటు నమోదు పై ఎలాంటి ఇబ్బందులు,సందేహాలు ఉన్న డీసీసీ కార్యాలయంలో మరియు అన్ని మండల కేంద్రాలల్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో స్పెషల్ డ్రైవ్ ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వారికి సహాయకరంగా మండల నాయకులు మరియు ప్రతి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉంటారని అన్నారు. దరఖాస్తు కోసం Form18 కూడా అందుబాటులో ఉన్నాయి అని తెలిపారు.

 

MLC ( Form-18) దరఖాస్తు కు పొందుపర్చవలసిన/జత పర్చవలసిన ధ్రువీకరణ పత్రములు.

• ఓటరు కార్డు యొక్క జిరాక్స్ ప్రతి    (ఓటరు కార్డు నెంబరు, పార్ట్ నెంబర్,పార్ట్ యందు గల సీరియల్ నెంబర్

• రెండు కలర్ పాస్ ఫోటోలు

• టెన్త్ మెమో జిరాక్స్ ప్రతి

• డిగ్రీ /డిప్లమా యొక్క మెమో

• డిగ్రీ డిప్లమా యొక్క పట్టా ధ్రువీకరణ పత్రము

• ఆధార్ కార్డు యొక్క జిరాక్స్ ప్రతి

• అన్ని జిరాక్స్ ప్రతులపైన  గెజిట్ అధికారితో అటెస్టేడ్ చేయించిన తరువాతనే online/off-line ద్వారా దరఖాస్తు చేసుకోగలరని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.