ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన POP ఫాల్స్ సీలింగ్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన POP ఫాల్స్ సీలింగ్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు

 

 

ప్రజాభవన్ – 20-01-2024

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి)

వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలంగాణ పి.ఒ.పి ఫాల్స్ సీలింగ్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు…..

 

కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నా ఆదరణ చూసి సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై హన్మకొండ 50 డివిజన్ నుండి సుమారు 300 మంది తేలంగాణ పి.ఒ.పి ఫాల్స్ సీలింగ్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు KGN ఫంక్షన్ హాల్ లో వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్బంగా నాయిని రాజేందర్ రెడ్డి వారికి ఖండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

 

కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో హమ్రాజ్, శంషాద్, జాకీర్, కమల్ అహ్మద్, జమాల్,. శాకీర్, రెహాన్, శాహజాద్, సూరజ్, ఇర్షాద్, మొహసిన్ తదితరులు పార్టీలో చేరారు.

 

ఈ కార్యక్రమంలో డివిజన్ అద్యక్షుడు మొహమ్మద్ అఫ్సర్, కార్పో రేటర్లు మానస రాంప్రసాద్, నెక్కొండ కల్పన కిషన్, మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్, వీరగంటి రవీందర్, బండారి జనార్ధన్ గౌడ్, టిపిసిసి సోషల్ మీడియా కార్యదర్శి మహమ్మద్ ముస్తాక్ నేహళ్, విష్ణు వర్ధన్ రెడ్డి, రహీం, చాంద్ పప్పు, కరీం, సద్దాం, చన్ను, మేదరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.