పలు అభివృద్ధి పనులపై హెచ్ఎండబ్ల్యూఎస్ & ఎస్బి డీజీఎం తో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సమావేశం

డివిజన్లోని పలు అభివృద్ధి పనులపై హెచ్ఎండబ్ల్యూఎస్ & ఎస్బి డీజీఎం నాగ ప్రియని కలిసిన మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

జనవరి 11, నల్లా సమాచార్ న్యూస్ / శేర్లింగంపల్లి :

మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో గల పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై HMWS & SB DGM నాగ ప్రియని మర్యాద పూర్వకంగా కలసినా మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో గల పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై HMWS : SB DGM నాగ ప్రియని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది అని డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ఉన్నటువంటి మంచి నీటి సమస్య ,మంచినీటి లైన్ల ఏర్పాటు కానీ , డ్రైనేజీ సమస్యలు కానీ త్వరగా పరిష్కరించాలని పలు కాలనీలలో దశాబ్ద కాలంనడు ఏర్పాటు చేసినటువంటి (హెచ్ డి పి) పైపు లైన్లను వెంటనే మార్చి కొత్తగా (డి ఐ) పైపు లైన్లను ఏర్పాటు చేయవలెను అని తెలియజేయడం జరిగింది, డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో మంజీర వాటర్ లీకేజీల పనులను ఏపటిక్కప్పుడు పరిశీలించి పునరుద్ధరణ పనులను చేపట్టి ప్రజలకు అందుబాటులో తీసుకు రావాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో HMWS & SB ఏరియా మేనేజర్ సునీత , వర్క్ఇన్స్పెక్టర్ రమేష్ , కురువ కిరణ్ , నర్సింహ ,మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.