MERRY CHRISTMAS సెమీ క్రిస్మస్ వేడుకల్లో… శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

MERRY CHRISTMAS సెమీ క్రిస్మస్ వేడుకల్లో.... శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి: సెమీ క్రిస్మస్ వేడుకల్లో…. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నల్లా సమాచార్ న్యూస్ ( ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) శేరిలింగంపల్లి:

శేరిలింగంపల్లి డివిజన్ లోగల రాజీవ్ గృహకల్ప జిహెచ్ఎంసీ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ఆవరణలో పాస్టర్ ప్రభు దాసు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిధులుగా పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . ఈ సందర్బంగా క్రైస్తవ మత పెద్దలు కార్పొరేటర్ ని ఉద్దేశించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజలకు ఇంకా మంచి చేసే అవకాశం, గొప్ప సేవకుడిగా ఉండేలా దేవుడు అవకాశం ఇవ్వాలని ప్రార్థించారు. కార్పొరేటర్  మాట్లాడుతూ.. పవిత్ర గ్రంథంలోని ప్రతి వాక్యం కూడా దేవుడి మాటలని ప్రతి విశ్వాసి ఆచరించి ఇరుగుపొరుగు వారికి సహాయపడాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు క్రీస్తు ఆశీస్సులు ఉండాలని, ఈ ఏడాది పవిత్ర క్రిస్మస్ రోజున ప్రతిఒక్కరూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని ప్రతిఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు(MERRY CHRISTMAS)తెలియచేసారు.

 

ఈ కార్యక్రమంలో బేరాక చర్చి పాస్టర్ ప్రభు దాసు, సీనియర్ పాస్టర్ యేసుపాదం, పాస్టర్ లు సామ్ బాబు, జో బాబు, పివి రత్నం, రమేష్ బాబు, సుందర్, వార్డ్ మెంబర్ శ్రీకళ, సౌజన్య, శశికళ, వెంకట్ రెడ్డి, అనిత, మధు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.