Health camp : కోహెడ మండల కేంద్రంలో మెగా హెల్త్ క్యాంపు.
ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
నల్లా సమాచార్ న్యూస్ / కోహెడ : ఆరోగ్యమే మహాభాగ్యం భాగంగా గవ్వ చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు. కోహెడ మండల పరిసర గ్రామాలలోని ప్రజలకు అధిక సంఖ్యలో పాల్గొని, ఈ మెగా క్యాంపుకు విచ్చేసి మీ ఆరోగ్యాన్ని పరీక్షించు కోవలసింది తెలిపారు. ఇలాంటి సేవ చేస్తున్న గవ్వ చారిటబుల్ ట్రస్ట్ గవ్వ వంశీధర్ రెడ్డి కి ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కోహెడ మండల కేంద్రంలో మరెన్నో సేవకార్యక్రమాలు చేయాలని వారికి మనవి చేశారు.