గిరిజనులపై అక్రమంగా దాడి చేసి చితక బాదిన ఫారెస్ట్ అధికారిపై చర్యలు తీసుకోవాలి

గిరిజనులపై అక్రమంగా దాడి చేసి చితక బాదిన ఫారెస్ట్ అధికారిపై చర్యలు తీసుకోవాలి

తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జిల్లా అధ్యక్షులు ఉండ్రాళ్ళ ఎల్లయ్య

 

డిసెంబర్ 16, నల్లా సమాచార్ న్యూస్ / మంచిర్యాల :

రెక్కాడితే గాని డొక్కాడని అణగారిన గిరిజన ఎరుకలకు లస్తులైన ఎల్లక్క,లక్ష్మణ్ లపై చెన్నూర్ ఫారెస్ట్ సెక్షన్ అధికారి బాలకృష్ణ చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ ఎరుకల ప్రజా సమితి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ఉండ్రాళ్ళ ఎల్లయ్య తెలిపారు..

అమాయకులైన ఎల్లక్క లక్ష్మన్ లపై గతంలో జరిగిన దాడి పై అధికారిని ప్రశ్నించి నందుకే కాకుండా,

ఇతరుల చేనులో చనిపోయిన పంది విషయంలో మీరే చంపారని కేసు పెట్టి బెదిరించి, గదిలో బంధించి మూత్రం పోసుకొనేటట్లు చితక బాది, భూతులు తిడుతూ గాయాలయ్యేంత కొట్టి, గతంలో బైక్ లాక్కొన్నటువంటి అది ఇవ్వాలంటే 25000/ ఇరవై ఐదు వేల రూపాయలు లంచం తీసుకొని ఇప్పటివరకు బైక్ ఇవ్వలేదని ఇంకా లంచం కావాలని వేధిస్తున్నారని వాపోయారు.వీరి పై దాడిని చూసిన లస్మయ్య మరియు ఇతర సాక్షులపై సైతం దాడి చేశాడని. ఈ విషయంలో అధికారులు స్పందించి ఫారెస్ట్ సెక్షన్ అధికారి అయిన బాలకృష్ణపై తగు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో

ఎరుకల కులస్తులంత పెద్ద యెత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం నాయకులు బాధితులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.