లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో నిత్య అన్నదాన ప్రసాద వితరణ “(FREE MEALS ON WHEELS)”

దాతలు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేసిన లయన్ v. మధుసూదన్ రెడ్డి

లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో నిత్య అన్నదాన ప్రసాద వితరణ “(FREE MEALS ON WHEELS)”

లైన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహిస్తున్న నిత్యాన్న ప్రసాద కార్యక్రమానికి దాతలు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేసిన లయన్ వి మధుసూదన్ రెడ్డి

జూలై 08, నల్లా సమాచార్ న్యూస్ / మంచిర్యాల :

లయన్స్ క్లబ్ మంచిర్యాల 50 సంవత్సరాలలో ప్రవేశించి స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా అక్టోబర్ 29 2023 సంవత్సరంలో ప్రారంభించిన “నిత్య అన్నదాన ప్రసాద” (FREE MEALS ON WHEELS) కార్యక్రమము లైన్స్ క్లబ్ మంచిర్యాల నుండి మొట్టమొదటిసారి గవర్నర్గా ఎన్నుకోబడిన లయన్ నడిపల్లి వెంకటేశ్వరరావు సలహా మేరకు ప్రారంభించి ఈ రోజుకు 243వ రోజుకు చేరినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రీసన్ లో ఉన్న అన్ని క్లబ్బుల సభ్యుల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నామని, పట్టణానికి దూరంగా గోదావరి రోడ్ లో ఉన్న మాత శిశు కేంద్రంలో వైద్యము నిమిత్తము వివిధ ప్రాంతాల నుంచి పేద ప్రజలు మరియు గర్భిణీ స్త్రీలు వారి వెంట వచ్చే అటెండర్స్ కొరకు మధ్యాహ్న భోజనానికి ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించి లైన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఈ కార్యక్రమంలో రోజు 150 నుంచి 200 మందికి ఉచితంగా మధ్యాహ్న భోజన సదుపాయాన్ని సమకూరుస్తున్నట్లు ఈ కార్యక్రమాన్ని 365 రోజులు అనగా అక్టోబర్ మాసం వరకు నిర్వహిస్తున్నట్టు ప్రోగ్రాం చైర్ పర్సన్ లయన్ వి మధుసూదన్ రెడ్డి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ బాల్మోహన్, ప్రోగ్రాం చైర్ పర్సన్ లయన్ వి మధుసూదన్ రెడ్డి, సీనియర్ లయన్ మెంబర్స్ లయన్ జి శ్యాంసుందర్రావు, లయన్ పి హనుమంతరావు, లయన్ వి వినయ్ కుమార్, లయన్ గుండా శ్రీనివాస్, లయన్ కొత్త సురేందర్, లయన్ ఏ బాలాజీ, లయన్ వెంకటేశ్వర్లు, లయన్ తిరుపతిరెడ్డి లయన్ డేగ బాబు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.