అధికారిక సమావేశాలలో మహిళా కార్పొరేటర్ లతో వారి భర్తలు…

జోనల్ కమిషనర్ స్నేహ శబరిష్ ని కలిసి అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ కార్పొరేటర్, అడ్వకేట్ బొబ్బ నవత రెడ్డి

అధికారిక సమావేశాలలో మహిళా కార్పొరేటర్ లతో వారి భర్తలు…

 మహిళా రిజర్వేషన్ కు, మహిళా సాధికారతకు విలువ ఎక్కడ?

 పురుష కార్పొరేటర్ లతో పాటు వారి భార్యలను కూడా తీసుకొని వెళ్ళండి?

 ఇలాంటి చర్యలకు మహిళా సమాజం సిగ్గు పడుతోంది.

జోనల్ కమిషనర్ స్నేహ శబరిష్ ని కలిసి అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ కార్పొరేటర్, అడ్వకేట్ బొబ్బ నవత రెడ్డి

ఫిబ్రవరి 08, నల్లా సమాచార్ న్యూస్ / శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో నిన్న 07.02.24 రోజున జోనల్ కమిషనర్ అద్వర్యం లో ప్రజాప్రతినిధులు మరియు GHMC అధికారులతో కలిసి అభివృద్ధి పై సమీక్ష సమావేశం జరిగినది. ఆ సమావేశం లో మహిళా కార్పొరేటర్లతో పాటు వారి భర్తలు కూడా సమావేశం లో పాల్గొనటం జరిగినది ఈ సందర్బంగా మాజీ కార్పొరేటర్, అడ్వకేట్ బొబ్బ నవత రెడ్డి మాట్లాడుతూ ఇది చట్ట విరుద్ధం… మహిళలను అవమానించడమే.. అని ఒక మహిళా అధికారిగా ఈ విషయాన్ని ఖండించి చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నాను అని అన్నారు. ఇలాంటి సమావేశాలకు అనుమతి ఇస్తే.. రేపు కౌన్సిల్ సమావేశంలో కూడా మహిళూ కార్పొరేటర్ లతో పాటు వారి భర్తలను కూడా అనుమతి ఇస్తారా? అని పురుష కార్పొరేటర్ల తో పాటు వారి భార్యలను కూడా అనుమతి ఇస్తారా?? అని ప్రశ్నించారు. ఇలా చేసుకుంటూ పోతే మహిళా రిజర్వేషన్ కు, మహిళా సాధికారితకు విలువ ఎక్కడిది? అని అన్నారు. ఒక మహిళగా, మాజీ కార్పొరేటర్ గా, అడ్వకేట్ గా ఇట్టి విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి సంఘటనలు డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో కూడా జరుగుతున్నాయి. ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి అధికారుల దగ్గరకు పోయినప్పుడు వారి భర్తలు కూడా వెళ్తున్నారు .దీన్ని కూడా ఆపవలసి ఉంది అన్నారు. ఒక మహిళా అధికారిగా ఇట్టి విషయాన్ని అర్థం చేసుకొని మరొక్కసారి జరగకుండా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను అని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.