కృష్ణాజలాల గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత కోల్పోయిన బిఆర్ఎస్: కప్పాటి పాండురంగారెడ్డి

కృష్ణాజలాల గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత కోల్పోయిన బిఆర్ఎస్: కప్పాటి పాండురంగారెడ్డి

 

 

కృష్ణా జల్లాల గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత కోల్పోయిన బిఅర్ఎస్…

నల్లా సమాచార్ న్యూస్ ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి 9849396606:

కృష్ణా జలాలపై నీటి హక్కులపై కెఆర్ఎంబికి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగిస్తూ తెలంగాణ ప్రజలకు నష్టం కలిగిస్తున్నారంటూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,బిఅర్ఎస్ నాయకులు మొసలు కన్నీరు కార్వడం లాంటిదేనని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి అన్నారు.

గురువారం కందుకూరు మండల కేంద్రములో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కప్పాటి పాండురంగా రెడ్డి మాట్లాడుతూ కృష్ణా జల్లాల గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత కోల్పోయిన బిఅర్ఎస్ నాయకులు అంటూ పది సంవత్సరాలు అధికారం మత్తులో జోగి గోదావరి జలాల ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రదానంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కెసిఅర్, హరీశ్ రావుల అవినీతి బట్టబయలై జైలుకు వెళ్ళే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రజలను పక్కత్రోవ పట్టించేందుకు నేడు కృష్ణా జలాలపై కృతిమ హంగామ సృష్టిస్తున్నారని అన్నారు.

కృష్ణా జలాల్లో నాణ్యమైన వాటా విషయంలో కేంద్ర ప్రభుత్వ వివక్షత బి.ఆర్.ఎస్ నిర్లక్ష్యము దగాపడ్డ దక్షిణ తెలంగాణ. 2014 విభజన హామీల మేరకైనా కృష్ణాజిల్లా న్యాయమైన వాటా ఇవ్వకుండా మొత్తం జల వనరుల మీద కేంద్ర ప్రభుత్వం తన గుత్తాధిపత్యం కొరకు గెజిట్ తీసుకువస్తే ఆరోజు కెసిఆర్ మౌనంగా ఉన్నాడని ఆయన ఆరోపించారు. నాడు ప్రతిపక్ష పార్టీలు,మేధావులు ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేసిన బిఅర్ఎస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని అన్నారు

అటు ఆంద్రప్రదేశ్ ఇటు మహరాష్ట్రతో వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం చెలిమిచేస్తూ నీటి వాటాలో తెలంగాణ ప్రజా ప్రయోజనాలను బిఅర్ఎస్ ప్రభుత్వం ఫణంగా పెట్టిందని అన్నారు.

తొమ్మిదిన్నర సంవత్సరాలు అదికారం వెలగ బెట్టి ఎన్నికల ముందు బిఅర్ఎస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను గ్రహించి ప్రజలదృష్టిని మళ్ళించడానికి హడావుడిగా మెడికల్ కళాశాలను ప్రారంభించింది తప్ప కందుకూరు మండల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని వున్నది కేవలం కపట ప్రేమ మాత్రమేనని అన్నారు. రాజధాని నగరానికి అతిచేరవలో వుండి అభివృద్ధిలో మాత్రం ఎందుకు వెనకవేయబడిందో మాజీ మంత్రి తెలియజేయాలని అన్నారు. అధికారంలో వుండి అయిదు సంవత్సరాలు సర్పంచ్ లను నానా అగచట్లు పెట్టి అప్పులపాలు జేసి ఈరోజు వారికి వీడుకొలు సమావేశాలు పెట్టి ఎక్కడలేని సానుభూతిని ప్రదర్శిస్తూ, ప్రశంసించడం విడ్డూరంగా వుందని పాండురంగా రెడ్డి పేర్కొన్నారు.

ధన్యవాదములతో

Leave A Reply

Your email address will not be published.