జగదీశ్వర్ గౌడ్ ఆదేశాలమేరకు ఎల్లమ్మబండ గాంధీనగర్ లో 10సంవత్సరాల విద్యుత్ సమస్యలు తీర్చిన 124డివిజన్ కాంగ్రెస్ నాయకులు

జగదీశ్వర్ గౌడ్ ఆదేశాలమేరకు గాంధీనగర్ లో 10సంవత్సరాల విద్యుత్ సమస్యలు తీర్చిన 124డివిజన్ కాంగ్రెస్ నాయకులు

శేరిలింగంపల్లి నియోజకవర్గం

124 డివిజన్ ఆల్విన్ కాలనీ ఎల్లమ్మ బండ jnnurm phase ii గాంధీ నగర్ లో గత 10 సంవత్సరాల నుంచి ఒకటే విద్యుత్ స్తంభానికి అనేక కనెక్షన్లు ఉన్నాయి . దీని వల్ల అక్కడ ప్రజలు పలుమార్లు గత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్న ఎవరు స్పందించలేదు. వారం రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ శేిలింగంపల్లి ఇంచార్జ్ జగదీష్ అన్న గారు గడప గడపకు పాదయాత్రకు వచ్చినపుడు అక్కడ ప్రజలు అన్నగారి కి విజ్ఞప్తి చేసుకోగా వెంటనే స్పందించి కాంగ్రెస్ నాయకుడు పట్వారీ శశిధర్ కు మరియు విద్యుత్ శాఖ AE అధికారులను సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోమని ఆదేశించారు.10 సంవత్సరాల నుండి తీరని సమస్యను వారం రోజుల కాల వ్యవధిలో పరిష్కరించబడింది అని కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో AE షాబాద్ అహ్మద్ కాంగ్రెస్ నాయకులు పట్వారీ శశిధర్, రవి, విరేష్ చారీ యువ నాయకులు పండు, మజర్ , లోకేష్ , శివ మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.