ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర మహిళా మోర్చ అధ్యక్షురాలు శిల్పా రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా

ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర మహిళా మోర్చ అధ్యక్షురాలు శిల్పా రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా

తేదీ 09-07-2024 రోజున ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1:00pm వరకు రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారి ఆధ్వర్యంలో, ధర్నా నిర్వహించడం జరిగింది.

కానరాని* *మహిళా* *గ్యారంటీలు* – *కదం* *తొక్కిన* *మహిళలు* . అనే నినాదంతో తెలంగాణ బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించబడింది .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రివర్యులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ *జి* *కిషన్* *రెడ్డి* గారు పాల్గొన్నారు . ధర్నా కార్యక్రమానికి తెలంగాణ లోని మహిళలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రంగారెడ్డి అర్బన్ సెక్రటరీ చెన్నమనేని స్రవంతి, డివిజన్ ప్రెసిడెంట్లు లలిత ,సైంధమ్మ, స్రవంతి మరియు జనరల్ సెక్రటరీస్ మమత, సంధ్య, వైస్ ప్రెసిడెంట్ రేణుక, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.