Independence day :77వ భారత స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అధికారులు సకాలంలో హాజరు కావాలి.
ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజ్
నల్లా సమాచార్ న్యూస్ (భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో) :
77వ భారత స్వాతంత్ర్య దినోత్సవo సందర్భంగా ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో జాతీయ పతాక ఆవిష్కరణ వందన స్వీకారం కొరకు ఐ టి డి ఎ యూనిట్ అధికారులు, సిబ్బంది సకాలంలో హాజరై కార్యక్రమం విజయవంతం అవ్వడానికి కృషి చేయాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ ఇన్చార్జి ఆర్ సి ఓ గురుకులం డేవిడ్ రాజ్ అన్నారు.
సోమవారం నాడు ఐటీడీఏ సమావేశం మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్ అధికారిక పనులపై వెళ్లినందున, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ మరియు ఏవో భీము తో కలిసి వివిధ ఆదివాసి గిరిజన గ్రామాల నుండి వచ్చిన గిరిజనుల నుండి ఆయన అర్జీలు స్వీకరించి, తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి, మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని ఆయన అన్నారు. ఈరోజు గిరిజన దర్బార్ లో అత్యధిక శాతం దరఖాస్తులు పోడు భూముల పట్టాలు ఆన్లైన్ చేయించుట కొరకు, వ్యవసాయానికి సంబంధించి కరెంటు, బోరు, మోటార్ కొరకు, గిరిజన గ్రామాలలో విద్యుత్ సౌకర్యం ఇప్పించుట కొరకు, పై చదువులు చదవడానికి ఆర్థిక సహాయం కొరకు, గురుకులం జూనియర్ కళాశాలలో ప్రవేశాల కొరకు ,గురుకులం పాఠశాల ఐదవ తరగతిలో ప్రవేశాల కొరకు, స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పెంపొందించుకోవడానికి ఆర్థిక సహాయం కొరకు, దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సాయం ఇప్పించుట కొరకు, గిరిజన గ్రామ పంచాయతీలలో గ్రామపంచాయతీ భవనాలు నిర్మాణం కొరకు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల కొరకు గిరిజనులు దరఖాస్తులు సమర్పించారని, ఈ దరఖాస్తులన్నీ ప్రత్యేకమైన రిజిస్టర్లలో నమోదు చేసి అర్హులైన ప్రతి గిరిజనులకు తప్పనిసరిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ సురేష్ బాబు, డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ శ్రీనివాస్, ఏ సి ఎం ఓ రమణయ్య, ఉద్యానవన అధికారి అశోక్ కుమార్, డిఎస్ఓ ప్రభాకర్రావు, ఏపీవో పవర్ మునీర్ పాషా, మేనేజర్ ఆదినారాయణ, హెచ్ ఈ ఓ దుర్గయ్య, నాగభూషణం, నరేందర్, సుగుణ, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.