హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని రాంనగర్ లో ప్రజాపాలన కేంద్రాన్ని పరిశీలించిన జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని రాంనగర్ లో ప్రజాపాలన కేంద్రాన్ని పరిశీలించిన జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) శేరిలింగంపల్లి నియోజకవర్గం:

హైదర్ నగర్ డివిజన్లోని రాంనగర్ కాలనీ ప్రజా పాలన కేంద్రాన్ని పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ జగదీశ్వర్ గౌడ్ గారు, ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలు అప్లికేషన్స్ కొరత గురించి జగదీశ్వర్ గౌడ్ గారి దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే నోడల్ ఆఫీసర్ ప్రశాంతి గారితో మాట్లాడి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా చూడాలని తగినన్ని అప్లికేషన్ ఫామ్స్ అందుబాటులో ఉంచాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో హైదర్ నగర్ డివిజన్ సీనియర్ నాయకులు సిందం శ్రీకాంత్, వెంకటేష్ యాదవ్, రాజిరెడ్డి ,నర్సింగ్ రావు, విష్ణు , నరసింహ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.