హైదరాబాద్ మెట్రో రెండో దశ సవరించిన ప్రతిపాదనలు ఆమోదించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కోరిన తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

హైదరాబాద్ మెట్రో రెండో దశ సవరించిన ప్రతిపాదనలు ఆమోదించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కోరిన తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

Hon’ble Chief Minister Sri Revanth Reddy called on Unoin Minister of Housing and Urban Affairs Sri Hardeep Singh Puri ji in New Delhi today.

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి)(ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) హైదరాబాద్.

హైద‌రాబాద్ మెట్రో రెండో ద‌శ స‌వ‌రించిన ప్ర‌తిపాద‌న‌లు ఆమోదించాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ది, గృహ‌నిర్మాణ శాఖ మంత్రి శ్రీ హ‌ర్‌దీప్‌సింగ్ పూరికి ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి విజ్ఙ‌ప్తి చేశారు. కేంద్ర మంత్రిని గురువారం సాయంత్రం ముఖ్య‌మంత్రి క‌లిసి రాష్ట్రానికి సంబంధించిన ప‌లు స‌మ‌స్య‌లను ఆయ‌న దృష్టికి తీసుకెళ్లారు.

 

హైద‌రాబాద్ మెట్రో రెండో ద‌శ‌ను (బీహెచ్ఈఎల్‌-ల‌క్డీకాపూల్‌, నాగోల్‌-ఎల్‌బీ న‌గ‌ర్, 26 కి.మీ., రూ.9,100 కోట్ల అంచ‌నా వ్య‌యం; విమానాశ్ర‌యం మెట్రో కారిడార్: రాయ‌దుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్ర‌యం వ‌ర‌కు 32 కి.మీ, రూ.6,250 కోట్ల అంచ‌నా వ్య‌యం) స‌వ‌రించాల్సి ఉంద‌ని తెలిపారు. స‌వ‌రించిన ప్ర‌తిపాద‌న‌ల ప్ర‌కారం ఈ ప్రాజెక్టును కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంయుక్తంగా చేప‌ట్టే విష‌యాన్ని ప‌రిగ‌ణించాల‌ని ముఖ్య‌మంత్రి కేంద్ర మంత్రిని కోరారు.

 

హైద‌రాబాద్‌లోని మూసీ రివ‌ర్ ఫ్రంట్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని, అమ్యూజ్‌మెంట్ పార్కులు, వాట‌ర్ ఫాల్స్‌, చిల్డ్ర‌న్స్ వాట‌ర్ స్పోర్ట్స్‌, బిజినెస్ ఏరియా, దుకాణ స‌ముదాయాల‌తో బ‌హుళ విధాలా ఉప‌యోగ‌ప‌డేలా చేయాల‌నుకుంటున్న‌ట్లు కేంద్ర మంత్రికి ముఖ్య‌మంత్రి వివ‌రించారు. ఇందుకు కేంద్ర ప్ర‌భుత్వం స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని, అవ‌స‌ర‌మైన మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కేంద్ర‌మంత్రి పురీని ముఖ్య‌మంత్రి కోరారు.

రాష్ట్రంలో పేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని, ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న కింద వాటిని ఇచ్చేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు. తెలంగాణ‌కు ఇళ్లు మంజూరు చేయ‌డంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుద‌ల చేయాల‌ని కేంద్ర మంత్రికి ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.