హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం: ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి

హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

కాంగ్రెస్ భవన్ – 05-07-2024..

హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు & హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…

తెలంగాణా సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చి ఇవాళ కొత్తగా పాటలు చెబుతూ వీరు నీతి వాక్యాలు మాట్లాడుతున్నారు.

బీఆర్ఎస్ నాయకులకు మతిభ్రమించిందని, వారు చేసిన అక్రమాలను నెగ్గించుకునేందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ భవనాన్ని టచ్ చేస్తే గాంధీ భవన్ కూలుస్తామంటున్నారని, మొగోళ్లయితే గాంధీభవన్ ను టచ్ చేయాలని సవాల్ విసిరారు

ల్యాండ్ కబ్జాలు చేసినోళ్లపై రౌడీ షీట్ ఓపెన్ చేసి చెడ్డీలు మీద ఉరికిస్తమని హెచ్చరించారు

దాస్యం వినయ్ భాస్కర్ చేసిన అక్రమాలు రెండు రోజులకు ఒకటి చొప్పున బయటపెడుతానని పేర్కొన్నారు.

ఇక నర్సంపేటలో పీకలేని పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక్కడి వచ్చి పీకుతాడా ?

ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పినా వాళ్లకు ఇంకా బుద్ధి రాలేదన్నారు.

తాను వాళ్లలా మాటలు గాలి మాటలు మాట్లాడడం లేదని, అన్ని అధారాలు ఉన్నాయని, వాళ్లకు ఆ స్థలాన్ని కేటాయించలేదని, ప్రెస్ క్లబ్ వెనకాల ఉన్న జాగా ఇస్తే వారు మార్పు కోసం లెటర్ పెట్టారు కానీ.. కేటాయించలేదన్నారు

 

గత ప్రభుత్వం 28 జిల్లాల్లో ప్రతి ఒక జిల్లాకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఒక ఎకరం భూమి పార్టీ కార్యలయలకి కేటాయించాలని జి.ఓ. ఇష్యూ చేసింది.

జిఓ ఇష్యూ చేసిందని మేము పార్టీ కార్యాలయం కోసం అప్లికేషన్ పెట్టం. కాని వారు మాకు ఆకనాలేడ్జ్ ఇచ్చారు తప్ప పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించలేదు. కేవలం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు మాత్రమే స్థలం కేటాయించుకున్నారు.

హన్మకొండలో ప్రెస్ క్లబ్ వెనకాల ప్రభుత్వం కేటాయిస్తే ఇక్కడ వద్దు వాస్తుకు లేదని ప్రారంభోత్సవానికి ఒక రోజు వదిలేసారు.

క్యాంప్ ఆఫీసు పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా పెట్టి భూమిలో ఎలాంటి అనుమతి లేకుండా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు.

ఇంకో విచిత్రమేమేటంటే హన్మకొండలో ప్రెస్ క్లబ్ వెనకాల ప్రభుత్వం కేటాయించిన సర్వే నెంబర్ వీరు కబ్జా చేసిన ప్రభుత్వ స్థలం సర్వే నెంబర్ ఒకటే.

బిఆర్ఎస్ పార్టీ నిర్మించిన పార్టీ ఆఫీస్ స్థలం పార్క్ కోసం కేటాయించిన స్థలం

సుప్రీమ్ కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారం పార్క్ స్థలంలో ఎలాంటి కట్టడాలు నిర్మించకూడదు.

కాని వీళ్లు అది పార్క్ ల్యాండ్ కాదు ఓపెన్ ల్యాండ్ అంటూ పార్టీ కార్యలయాన్ని నిర్మించారు.

బిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఇంటి నెంబరు లేదు, విద్యుత్ డిపార్టుమెంటు ఇంటి నెంబర్ లేనిది కరెంట్ ఎలా ఇచ్చారు?

ఇంతవరకు ప్రాపర్టీ టాక్స్ కట్టలేదు కరంట్ బిల్లు కట్టలేదు.

అధికార దాహంతో ఏది చేసిన నడుస్తుంది చెల్లుతుందని అనుకున్నారు భూకబ్జా చేసారు

నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన మాజీ ఏం.ఎల్.ఏ. లను అడుగుతున్నా మీరు గడుపులో బాణాలు వేసుకుంటూ గాంధీ భవన్ ధ్వంసం చేస్తాం అనడం కాదు .

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు బిఆర్ఎస్ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు కదా మీరు నీతి నిజాయితి వారు అయితే పార్టీ కార్యాలయానికి కావలసిన అనుమతి పత్రాలు ఎందుకు చూపెట్టడం లేదు.

అనితిక కట్టడం కాబట్టే మీరు మున్సిపల్ కార్పోరేషన్ వారు ఇచ్చిన నోటిసులకు సమాధానం చెప్పలేక పోతున్నారు.

ఇక కరెంటు మీటరు లేదని, ఇంటి నెంబర్ కూడా లేదని ఇవి నిజాలు కావో లేదో వాళ్లే చెప్పాలన్నారు. వాళ్లదగ్గర ప్రూఫ్ లు ఉంటే తీసుకురావాలని సవాల్ విసిరారు.

బిఆర్ఎస్ కార్యాలయం అనైతికంగా కట్టారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా కూలగోడుతాం. మీరు కట్టింది నైతికంగా అయితే దమ్ముంటే చర్చకు రండి నేను వస్తా అదే మీరు కట్టిన బిఆర్ఎస్ కార్యాలయం ముందు కూర్ల్చుంటా ? ఆ దమ్ము ధైర్యం ఉందా మీలో ఉండదు ఎందుకంటే అది కబ్జా చేసిన స్థలం.

హన్మకొండ బాలసముద్రంలో అనుమతి లేకుండా నిర్మించిన బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ని తొలగిస్తాం అని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, టిపిసిసి ప్రధాన కార్యదర్శి కూచన రవళి, పిసిసి సవ్భ్యులు నమిండ్ల శ్రీనివాస్, మాజీ సమితి ప్రెసిడెంట్ అసోడ రాజయ్య, కార్పోరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంధాల సంస్థ మాజీ చైర్మన్ మొహమ్మద్ అజీజ్ ఖాన్, కార్పొరేటర్లు పోతుల శ్రీమాన్, సయ్యద్ విజయశ్రీ రజాలి, గుంటి శ్రీనివాస్, ఇనుగాల మానస రాంప్రసాద్, చీకటి శారద ఆనంద్,మాజీ కార్పొరేటర్లు మొహమ్మద్ అబుబాకర్, పుప్పల ప్రభాకర్, తాడిశెట్టి విద్యా సాగర్, వీరగంటి రవీందర్, మాధవి రెడ్డి. అనుబంధ సంఘాల అద్యక్షులు బంక సరళ, పల్లకొండ సతీష్ గుంటి స్వప్న, నాయకులు బంక సంపత్, నాయిని లక్ష్మా రెడ్డి, రహీమున్నిస్సా బేగం, తాళ్ళపల్లి మేరీ, ఇప్ప శ్రీకాంత్, పల్లె రాహుల్ రెడ్డి డివిజన్ అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.