ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తాం: వి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తాం వి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

ప్రభుత్వం సహకారంతో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం.

ఇంటర్/టెన్త్ పరీక్షలు వ్రాసే విద్యార్థిని విద్యార్థులకు అల్ ది బెస్ట్..

ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య

వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్..

(నల్లా సమాచార్ న్యూస్ ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి)

లక్ష్యం కోసం కనే కలలు కమ్మనివే,కానీ చేరుకునే మార్గంలో ముల్లుంటాయి,భయపడి ఆగిపోతే జీవితం ఎడారి,దాటి వెళ్లగలిగేతే విద్యార్ధి జీవితం పూలవనం అవుతుందని,కాబట్టి పరీక్షలు వ్రాసే విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి తల్లిదండ్రుల ఆశయాలను,ఆలోచనలను గౌరవించి,విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులకు,కన్న ఊరికి మంచి పేరు వచ్చేవిధంగా ముందుకు సాగాలని కోరారు…

 

ఈరోజు అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో సైన్స్ డే సందర్భంగా నిర్వహించిన సైన్స్ ఫేర్ ను ప్రారంభించారు మరియు వచ్చే నెలలో ప్రారంభం అయ్యే పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు భారతీయ హై స్కూల్ మరియు ప్రభుత్వ పాఠశాలలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పట్వారీ శశిధర్ ఏరాటు చేసిన పరీక్ష పాడ్స్,స్టేషనరీని విద్యార్థులకు అందించారు..

 

ఈ కార్యక్రమంలో నాయకులు నల్ల సంజీవ రెడ్డి,కృష్ణ ముదిరాజ్,డివిజన్ అధ్యక్షులు మారెళ్ళ శ్రీనివాసరావు,దుర్గేష్,రెహమాన్,శివ,నవాజ్,సయ్యద్,రఫీ,లోకేష్,అబ్దుల్,రాజా,బాలు,నారాయణ,తిరుపతయ్య,సాయిరాం మహిళా నాయకురాలు అరుణ,సుజాత తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.