ఘనంగా పంచవటి విద్యాలయ 20వ వార్షికోత్సవం

ఘనంగా పంచవటి విద్యాలయ 20వ వార్షికోత్సవం

ఘనంగా పంచవటి విద్యాలయ 20 వ వార్షికోత్సవం ::

రెండు దశాబ్దాలుగా పాలమూరు జిల్లాలో విద్యారంగ చరిత్రలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో విద్యార్థులను డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతున్న పంచవటి విద్యాలయ నేడు 20వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా వున్నదని, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా చక్కటి విద్యా బోధనతో పాటు వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నదని పాఠశాల కరస్పాండెంట్ టి. అనితారెడ్డి తెలిపారు. ఈ సందర్భముగా తమ పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మహబూబ్నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాసరెడ్డి మరియు శాసన మండలి సభ్యులు కూచుకుళ్ళ దామోదరరెడ్డిలను ఆమె సాదరంగా వేదికపైకి ఆహ్వానించారు. కార్యక్రమాన్ని

జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థులపైన మానసిక ఒత్తిడి పెరుగుచున్నదని, తల్లిదండ్రులు తమ ఆశయాలను తమ పిల్లలద్వార సాధించుకోవాలని కోరుతున్నారని, తద్వార పిల్లలపై ఒత్తిడి పెరిగిపోతున్నదని తెలిపారు. ప్రశాంతవాతావరణంలో రనగొన ధ్వవనులకు దూరంగా స్థాపించబడిన పంచవటి విద్యాల లాంటి పాఠశాల తమ విద్యార్థులను ప్రారంభమునుండి చదువులో ఒత్తిడికి లోనుకాకుండా కర్యోన్ముఖులుగా విద్యార్థులను మలచి వారు భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా తయారుకావడానికి పాఠశాల కరస్పాండెంట్ టి.అనితారెడ్డి చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. కార్పోరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండావిద్యాబోధనగావిస్తున్న పాఠశాల “పంచవటి” అని ఆయన తెలిపారు. ఇందుకు పాఠశాల సాధిస్తున్న ఫలితాలే నిదర్శనమని తెలిపారు. ఈ సందర్భముగా పదవ తరగతి లోని 175 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే ఆత్మీయ కానుక 2డి/3డి డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ ను అందజేశారు. జిల్లాలో అత్యధికంగా 10/10 జిపిఏ సాధించిన పంచవటి రాబోవు 10వ తరగతి పరీక్షల్లో

కూడ అత్యధిక జిపిఏ సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలని విద్యార్ధును కోరారు. అందుకు తగ్గట్టుగా లక్ష్యంగా చేసుకుని పరీక్షలకు సన్నద్దం కావాలని కోరారు. అనంతరం పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమం

లో పాఠశాల ఛైర్మన్ టి. శ్రీకాంత్ రెడ్డి, డైరెక్టర్ టి. శ్రీనికేత్ రెడ్డి, ప్రిన్సిపల్ వెంటరమణ మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.