Free Health Camp ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన దొడ్ల వెంకటేష్ గౌడ్ కార్పోరేటర్
Free Health Camp ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన దొడ్ల వెంకటేష్ గౌడ్ కార్పోరేటర్
ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన దొడ్ల వెంకటేష్ గౌడ్ కార్పోరేటర్
నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) శేరిలింగంపల్లి నియోజకవర్గం:
అపోలో డయాగ్నస్టిక్స్ వారు 124 డివిజన్ పరిధిలోని సాయి నగర్ వెస్ట్ లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిధిగా డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై వైద్య శిబిరాన్ని సందర్శించి స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బి.పి, షుగర్ వంటి అన్ని జనరల్ పరీక్షలు ఉచితంగా నిరవహిస్తున్న వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వైద్యుల సలహాలు తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు రాజేష్ చంద్ర, శివరాజ్ గౌడ్, జి. ప్రభాకర్, శ్రీధర్ రావు, మహేష్, సాయిగౌడ్, సంతోష్ బిరాదర్, పద్మయ్య, శ్రీనివాస్, రాము, రమణయ్య, తుట్ట ప్రవీణ్, శ్రీధర్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.