పడమటి కేశవాపూర్ గ్రామం లో రైతు ఆత్మహత్య

రైతు ఆత్మహత్య
లంచం తీసుకుని మరీ ప్రభుత్వ రెవెన్యూ ఉద్యోగులు పని చేయకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైనట్లు కుటుంబ సభ్యుల వెల్లడి

రైతు శవంతో తాసిల్దార్ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యుల ధర్నా

చెట్టుకు ఉరి వేసుకొని మృతి

మార్చి 22, నల్లా సమాచార్ న్యూస్ / బచ్చన్నపేట :

 

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పడమటి కేశవపూర్ గ్రామంలో కుమ్మటి రఘుపతి అనే రైతు వద్ద బచ్చన్నపేట మండల రెవెన్యూ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ సుమన్, ఎం సి రవీందర్ రైతు పొలం పట్టా ఎక్కించుట నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకోని పని చేయకపోగా రైతును ఆఫీసుల చుట్టూ తిప్పించుకున్నారు. ఈ విషయంలో డబ్బులు కోల్పోయి పని జరగక త్రీవ్ర మనస్థాపానికి గురైన రైతు రఘుపతి పడమటి కేశవపూర్ గ్రామంలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. తమకు న్యాయం చేయాలంటూ బాదిత కుటుంబ సభ్యులు ఎమ్మార్వో ఆఫీస్ ముందు రైతు శవంతో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు బాధిత కుటుంబ సభ్యులు, మద్దతు దారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.