నవతెలంగాణ2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆవిష్కరించిన మాజీ కౌన్సిలర్ సునీత ప్రభాకర్ రెడ్డి

నవతెలంగాణ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆవిష్కరించిన మాజీ కౌన్సిలర్ సునీత ప్రభాకర్ రెడ్డి

ప్రజల సమస్యలు వెలికి తీసేవి పత్రికలే మాజీ కౌన్సిలర్ …ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వెలికి తీసి అధికారుల దృష్టికి తీసుకెళ్లేవి పత్రికలేనని చందానగర్ మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సునీత ప్రభాకర్ రెడ్డి లు అన్నారు. చందానగర్ లోని ఆమె నివాసంలో నవతెలంగాణ 2024 న్యూ ఇయర్ క్యాలెండర్ ను కాంగ్రెస్ నాయకులతో కల్సి ఆవిష్కరించారు. ప్రజాస్వామ్యం లో పత్రికల పాత్ర చాలా కీలకమని, పాలకులకు దిశానిర్దేశం చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని కోరారు. పత్రికలు సమస్యల పరిష్కారం లో తమ వంతు పాత్ర పోసించాలని సూచించారు. ప్రతీ ఇంట్లో ఉండేది క్యాలెండర్ అని, ముహుర్తాలు, పండుగలను మనకు ముందుగా తెలిపేవి క్యాలెండర్ లేనని పార్వతి అన్నారు. ఈ సందర్బంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు, నాయకులకు, అధికారులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోచయ్య, ఎండి గౌస్, చందర్ రావు, పార్వతి, గౌస్, శాంత, తన్వీర్ బేగం, ఎండి. గౌస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.