కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం
రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక
క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రతాపరెడ్డి గెలుపు కోసం పనిచేస్తా మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజలింగం
నవంబర్ 21, నల్లా సమాచార్ న్యూస్ / జనగామ :
జనగామ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే అభ్యర్థి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో, రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే నాగపురి రాజలింగం, ఈ సందర్భంగా హైదరాబాదులోని గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అనంతరం రాజలింగం గారు మాట్లాడుతూ, జనగామలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తానని, పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేస్తానని తెలుపుతూ, అలాగే బిఆర్ఎస్ పార్టీలో కనీసం విలువలు లేవని, ప్రజలకు గాని నాయకులకు గాని ఎలాంటి సహకారం చేయలేకపోతున్నానని తెలిపారు. ఉద్యమకారులను అణచివేయడంలో కేసీఆర్ ముందు వరుసలో నిలుస్తారని, అలాగే ప్రజల కోసం పనిచేసే వారిని గుర్తించడంలో వెనుకడుగు వేశారని, ప్రజల్ని నాయకుల్ని అణిచివేయడం జరుగుతుందని, మాయ మాటలు, అబద్ధాలు మోసపూరిత హామీలతో కాలయాపన తప్ప, రాష్ట్ర ప్రజల సంక్షేమం, అమరుల ఆశయం నెరవేరలేదని దీంతో మనోవేదన గురై నా సొంత పార్టీ అయినా కాంగ్రెస్లో చేరుతున్నానని తెలుపుతూ, కొమ్మురి ప్రతాప రెడ్డి గెలుపు, జనగామ ప్రజల విజయంగా భావిస్తూ, అందుకు నిరంతరం కృషి చేస్తానని, మన ప్రాంతం వారు కావున మన కోసం నిలబడే వ్యక్తి తాను, అందుకోసం రేపటినుండి క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రతాపరెడ్డి గెలుపు కోసం పనిచేస్తానని, కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీగా ఉందని, రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తూ, ఈ నియంత పరిపాలనపై ప్రజలు సంఘటితం కావాలన్నారు ఈ కార్యక్రమంలో మద్దూర్ జడ్పీటీసీ గిరి కొండల్ రెడ్డి గారు, ముఖ్య నాయకులు అంబాలా శ్రీనివాస్, గంగం గాలిరెడ్డి పాల్గొన్నారు.