మాజీ మంత్రి మాజీ పిసిసి అధ్యక్షులు డి.శ్రీనివాస్ మృతి పట్ల సంతాపం: వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన సలహాదారులు

ధర్మపురి శ్రీనివాస్ సేవలు చిరస్మరణీయం ఆయన మరణం పట్ల సంతాపం తెలిపిన వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన సలహాదారులు

మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ గారి మృతి పట్ల తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు సంతాపం ప్రకటించారు.

 

ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పని చేసిన డీఎస్ గారు కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని అభిప్రాయపడ్డారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డీఎస్ రాజకీయ నేతలెందరికో ఆదర్శంగా నిలిచారని ,ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.