ఘనంగా వైస్సార్ జయంతి వేడుకలు 

షాపూర్ నగర్ లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి కార్యక్రమం

ఘనంగా వైస్సార్ జయంతి వేడుకలు 

షాపూర్ నగర్ లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి కార్యక్రమం

 

జులై 08, నల్లా సమాచార్ న్యూస్ / కుత్బుల్లాపూర్ (గోపాల్ రెడ్డి ప్రతినిధి) :

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్ రాజశేఖర్‌రెడ్డి  75వ జయంతి సందర్భంగా షాపూర్ నగర్ లోని వైయస్ఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్  ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి  కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా వైయస్సార్  అమలు చేసిన సంక్షేమ పథకాలు పేద ప్రజల గుండెల్లో ఇప్పటికీ ఉన్నాయని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108 లాంటి గొప్ప పథకాలు రాజశేఖర్ రెడ్డి అమలు చేసి, పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్ గారిదని గుర్తు చేసారు. వైయస్సార్ చేసిన మంచి పనులే ఆయనను ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంచిందని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  నాయకత్వంలో వైయస్సార్ ఆశయాల సాధనకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని శ్రీశైలం గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సొంటిరెడ్డి పున్నారెడ్డి, లక్ష్మారెడ్డి, పాల కృష్ణ, ఓరుగంటి క్రిష్ణా గౌడ్, బుచ్చిరెడ్డి, బొబ్బ రంగారావు, కూన రఘు గౌడ్, మోతె శ్రీనివాస్ యాదవ్, బండి శ్రీనివాస్ గౌడ్, ఏర్వ వెంకటరమణ, ఆర్.లక్ష్మి, బేకు శ్రీనివాస్, పండరి, శివ, గణేష్, లాయక్, శ్రీధర్ రెడ్డి, రషీద్, దుర్గా రావ్, కృష్ణ యాదవ్, రషీద్ బేగ్, పూలమ్మ, శ్యామల, కుమ్మరి శంకర్, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని దివంగత వైయస్ రాజశేఖర్‌రెడ్డి  ఘనంగా నివాళులర్పించారు.

Leave A Reply

Your email address will not be published.