తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల మంత్రివర్గ శాఖను ఏర్పాటు చేయాలి : ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ (EWS welfare association) డిమాండ్

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల మంత్రివర్గ శాఖను ఏర్పాటు చేయాలి: ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ (EWS welfare association) డిమాండ్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నూతన ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ శాఖ మంత్రి ఎస్ సవితకు ప్రత్యేక శుభాకాంక్షలు

జూన్ 14, నల్లా సమాచార్ న్యూస్ / హైదరాబాద్ :

తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాలగా ముద్రపడి ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం మంత్రివర్గ శాఖను ఏర్పాటు చేయాలి అని ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖను కొనసాగిస్తూ నూతన ప్రభుత్వం మంత్రిగా ఎస్ సవితను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తూ వారి అభివృద్ధిలో ప్రభుత్వాలు కృషి చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నల్ల సంజీవరెడ్డి, అధ్యక్షులు మండలం అఖిల్, జనరల్ సెక్రటరీ అన్నేపల్లి లింగారెడ్డి, ఉపాధ్యక్షుడు నాగరాజు బ్రహ్మానందం, కార్యదర్శి లక్ష్మయ్య దార, సలహాదారులు కొప్పుల సంజీవరెడ్డి, మీడియా కన్వీనర్ మినుకూరి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.