మాజీ పిసిసి అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత ఆయన సేవలు చిరస్మరణీయం: వి జగదీశ్వర్ గౌడ్ ఇంఛార్జ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ

మాజీ పిసిసి అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత ఆయన సేవలు చిరస్మరణీయం: వి జగదీశ్వర్ గౌడ్ ఇంఛార్జ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెసు పార్టీ

 

 

ధర్మపురి శ్రీనివాస్ గారి సేవలు చిరస్మరణీయం..

 

మాజీ మంత్రి,పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ గారి మరణం పట్ల శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ వి.జగదీశ్వర్ గౌడ్ సంతాపం ప్రకటించారు.

 

ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పని చేసిన డీఎస్ గారు కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు.సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని అభిప్రాయపడ్డారు.సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డీఎస్ రాజకీయ నేతలెందరికో ఆదర్శంగా నిలిచారని,ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.

 

ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.