కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
కొన్నే గ్రామ ఇందిరానగర్ కాలనీ నుండి ప్రచార ప్రారంభం
నవంబర్ 11, నల్లా సమాచార్ న్యూస్ / బచ్చన్నపేట :
డోర్ టు డోర్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా ఈరోజు కొన్నే గ్రామంలో ఇంటింటికి ఆరు గ్యారెంటీ పథకాలను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను వివరించడం జరిగింది అన్నింటికంటే ముందుగా ఆనవాయితీగా గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నటువంటి కి ఇందిరానగర్ కాలనీ కి వెళ్లి ప్రచారం మొదలుపెట్టడం జరిగింది గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇండ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంచ వెంక రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షుల పిట్టల ఇస్తరి, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ గని గౌడ్, ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు పార్టీ పథకాలను క్షుణ్ణంగా వివరించి చెప్పడం జరిగింది..