Dharna at Collecter Office Hanmakonda 19నాడు ధర్నా హన్మకొండ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా రెడ్డి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (రెడ్డి ఐకేసీ)

Dharna Hanmakonda Collecter Office 19నాడు హన్మకొండ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా రెడ్డి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (రెడ్డి ఐకేసీ)

రెడ్డి కార్పొరేషన్ సాధనకై ఈ నెల 19న జరిగే ధర్నాను విజయవంతం చేయాలి

-రెడ్డి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (రెడ్డి ఐకేసీ)రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి పిలుపు.

హనుమకొండ జిల్లా భీమారంలోని జిఎంఆర్ గార్డెన్స్ లో హనుమకొండ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రెడ్డి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు గోపు జయపాల్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వము 2018లో హామీ ఇచ్చిన విధంగా రెడ్డి కార్పొరేషన్ ను రూ.5000ల కోట్లతో సత్వరమే ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో ఈ నెల 19వ తేదీన హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఎదురుగా సుమారు పదివేల మంది రెడ్డి కులస్థులచే నిర్వహించ తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వo ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో పూర్తి జాప్యం చేస్తున్నదని ఎన్నికల లోపు ప్రకటించాలని, ప్రభుత్వ మేనిఫెస్టోలో పెట్టిన రెడ్డి కార్పొరేషన్ గురించి గత నాలుగు సంవత్సరాలుగా వివిధ దశలలో ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ నెల 19న జరిగే ధర్నాకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెడ్డి కులస్తులు కుటుంబ సభ్యుల సమేతంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరో అతిధి కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి మాట్లాడుతూ రెడ్డి అంటే కులము కాదని గుణం అని రెడ్డి కులంలో ఎంతో మంది నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారని, రెడ్ల చిరకాల కోరికైన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కార్పొరేషన్ ప్రకటించేలా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తానని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆయా మండలాల నుంచి విచ్చేసిన రెడ్డి కుల నాయకులు వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు రెంటాల కేశవరెడ్డి, రావుల నరసింహారెడ్డి, చందుపట్ల నరసింహారెడ్డి, కామిడి సతీష్ రెడ్డి, రాధారపు సంజీవరెడ్డి , బిల్లా సుధీర్ రెడ్డి, జనగాం జిల్లా అధ్యక్షుడు లోకమంతరెడ్డి, వీసం సురేందర్ రెడ్డి, మన్నెం ఇంద్రారెడ్డి, కూచన రవళిరెడ్డి, రాజిరెడ్డి, పులి వీరారెడ్డి, లెక్కల జలంధర్ రెడ్డి, కోయగూర వెంకటరంగారెడ్డి, వీసం రమణా రెడ్డి, జినుగు గోవర్ధన్ రెడ్డి, మాడుగుల పాపిరెడ్డి, దూదిపాల తిరుపతిరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, నల్ల సంతోష్ రెడ్డి, గంగిడి ప్రభాకర్ రెడ్డి, వనంరెడ్డి, అర్జుల కిషన్ రెడ్డి, పత్తి సంపత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో సుమారు 500 వరకు రెడ్డి కులస్తులు పాల్గొన్నారు.

*హనుమకొండ జిల్లా రెడ్డి సంఘం నూతన కమిటీ ఎన్నిక* హనుమకొండ జిల్లా రెడ్డి సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు,

జిల్లా అధ్యక్షులుగా అర్జుల కిషన్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడుగా పత్తి సంపత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఊకంటి వనంరెడ్డితో పాటు మరో 30 మందిని జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.