దేశం కోసమే నేతాజీ జీవితం అంకితం: వి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

దేశం కోసమే నేతాజీ జీవితం అంకితం: వి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

దేశం కోసమే నేతాజీ జీవితం అంకితం..

నేతాజీ కన్నా కలలు అందరు కలిసి సాధించాలి..

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి):

నేడు వారి జయంతిని పురస్కరించుకుని నల్లగండ్ల గ్రామంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

 

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నేతాజీ సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు.శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని నల్లగండ్ల గ్రామంలో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు..

 

ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు హాజరయ్యారు.నేతాజీ తన జీవితం అంత దేశం కోసం అంకితం చేశారని గుర్తుచేసుకున్నారు.నేతాజీ గారి జీవితం దాదాపు అజ్ఞాతవాసం లాంటిదేనని,జీవితంలో ఎక్కువ భాగం ప్రవాసంలో గడిపారన్నారు..

 

దేశం కోసం తన సర్వస్వం త్యాగం చేశాడని.ప్రపంచం మొత్తం నేడు భారత్ వైపు చూస్తోందన్న,నేతాజీ గారు కన్నా కలలు అందరు కలిసి వాటిని సాధించాలని,నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.తద్వారా ప్రపంచంలో శాంతి,సౌభ్రాతృత్వాన్ని వ్యాప్తి చేయవచ్చన్నారు..

 

ఈ కార్యక్రమంలో నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి,శ్రీ కృష్ణ యూత్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,బలరాజ్ యాదవ్,గౌరవ అధ్యక్షులు మల్లికార్జున్ యాదవ్,యాదగిరి,శివ గౌడ్,విజేందర్ రెడ్డి,మోహన్ రెడ్డి,రాజు ముదిరాజ్,ప్రవీణ్ ముదిరాజ్,బాలకృష్ణ,జగదీశ్,వెంకటేష్ ముదిరాజ్,రాజేందర్ తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.