డిప్యూటీ కలెక్టర్ & తహశీల్దార్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

డిప్యూటీ కలెక్టర్ & తహశీల్దార్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

ఈ రోజు శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ & తహసిల్దార్. గౌ! శ్రీ!కె.వెంకా రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు.

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి 9849396606)

నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా .

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చెరువులు, కుంటలను, ప్రభుత్వ భూములను కాపాడాలని, భూకబ్జా విషయములు ఒక్కటొక్కటిగా వివరించి… అట్టి ఆక్రమనకు గురైన భూమిని (స్థలాలు)అక్రమార్కుల నుండి కాపాడి… అట్టి అక్రమాలకు పాల్పడిన వారిపై తగు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి మరియు ప్రభుత్వ స్థలములో ఎలాంటి స్టేజ్ (నిర్మాణం)లో ఉన్న అట్టి నిర్మాణము ప్రభుత్వ అధీనంలోకి తీసుకొని, అట్టి భూములు ప్రజాప్రయోజనాల ఉపయోగము కొరకు ఉపయోగించాలి… ఆక్రమణదార్లు ఎవరైన ( రాజకీయ నాయకులు & ఎవరైనా)తగిన చర్యలు తీసుకోవాలని. శేరిలింగంపల్లి కాంగ్రెస్ నాయకులు డిప్యూటీ కలెక్టర్ & తహశీల్దార్ గారిని కోరారు.

దానికి డిప్యూటి కలెక్టరు & తహసిల్దార్, సానుకూలంగా స్పందించి శేరిలింగంపల్లి మండలము పరిధిలో ప్రభుత్వ భూముల విషయంలొ సమాచారం ఇచ్చినచో తగిన చర్యలు తీసుకుంటామని మరియు ఎల్లవేళలా అందుబాటులో వుంటామని వారు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో నాయకులు గౌ! శ్రీ! నల్ల సంజీవరెడ్డి, శ్రీ వీరమల్ల వీరేందర్ గౌడ్, శ్రీ బి.కృష్ణ ముదిరాజ్, శ్రీ దినేష్ రాజ్, శ్రీ ముద్దంగుల తిరుపతి,బి.నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.