షిరిడి నగర్ కాలనీ సమస్యలపై పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

పలు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ

షిరిడ నగర్ కాలనీ సమస్యలపై పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

 

జూలై 07, నల్లా సమాచార్ న్యూస్ / 124 డివిజన్ ఆల్విన్ కాలనీ :

124 డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధిలోని షిరిడి నగర్ కాలనీలో విద్యుత్ మరియు డ్రైనేజ్ నాలాకు సంబంధించి సమస్యలు ఉన్నాయని షిరిడి నగర్ అసోసియేషన్ సభ్యులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకుని రాగా కార్పొరేటర్ షిరిడి నగర్ కాలనీలో పాదయాత్ర చేసి సమస్యలను స్వయంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ షిరిడి నగర్ లో ట్రాన్స్ఫార్మర్ మార్చాలన్న విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడామని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. అలాగే కాలనీ అసోసియేషన్ ఆఫీస్ నిర్మాణం, ఓపెన్ నాలా క్లీనింగ్ మరియు చిన్న కాల్వర్టర్ కు పెండింగ్ వర్క్స్ చేయవలసి ఉందని వీటిని కూడా సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి తొందరలో సమస్యలను పరిష్కరిస్తామని కాలనీ వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, మోజెస్, కాలనీ అధ్యక్షులు CH. శ్రీధర్, జెనరల్ సెక్రటరీ డి.మూర్తి, అమరెందర్ రెడ్డి, ప్రవీణ్ సింగ్, సురేష్, సాయిబాబా, కరుణాకర్, సారంగపాని, శ్రీనివాస్ రావు, సాయి కుమార్, చంద్రమౌళి, అశోక్, రామ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.