ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ఆధార్, రేషన్ కార్డుల జిరాక్స్ కాపీలను విద్యుత్ సిబ్బందికి ఇవ్వండి

గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును పొందండి

ఉప్పల్ నియోజకవర్గం ప్రజలకు పరమేశ్వర్ రెడ్డి పిలుపు

ఫిబ్రవరి 05, నల్లా సమాచార్ న్యూస్ / ఉప్పల్ :

రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల విద్యుత్తులో ఉచితంగా ఇవ్వనుందని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని పొందాలని సూచించారు.

విద్యుత్తు అధికారులే నేరుగా లబ్ధిదారుల ఇంటికి వచ్చి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ జిరాక్స్ పత్రాలను తీసుకుంటారని తెలిపారు. ఈ రెండు రకాల జిరాక్స్ పత్రాలను విద్యుత్ శాఖ అధికారులు లేదా సిబ్బందికి అందజేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పరమేశ్వర్ రెడ్డి కోరారు.

Leave A Reply

Your email address will not be published.