ప్రజలకు అందుబాటులో ఉంటా

ఎప్పటికప్పుడు డివిజన్ పరిధిలో ఏర్పడిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాము..

ప్రజలకు అందుబాటులో ఉంటా

ఎప్పటికప్పుడు డివిజన్ పరిధిలో ఏర్పడిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాము..

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్

జనప్రియ నగర్-2,హాఫీజ్ పెట్ డివిజన్

జనవరి 09, నల్లా సమాచార్ న్యూస్ / శేర్లింగంపల్లి :

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పక్క ప్రణాళికతో గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని, శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ప్రతి డివిజన్ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని,ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం చూపుతామని,డివిజన్ పరిధిలో మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేల అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు వి.జగదీశ్వర గౌడ్..

ఈ రోజు హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్-2 నందు స్థానిక ప్రజలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి నెలకొన్న కాలనీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం కాలనీ చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు..

ఈ కార్యక్రమంలో నాయకులు నాగేశ్వరరావు,బల్లింగ్ యాదగిరి గౌడ్, నరేందర్ గౌడ్, సంగారెడ్డి, మనెపల్లి సాంబశివరావు, సత్యనారాయణ, ఉమామహేశ్వరరావు, అశోక్, కొండల్ రావు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.