ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పు చూపించడం ఇది మీ ఆహంకారానికి నిదర్శనం…

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పు చూపించడం ఇది మీ ఆహంకారానికి నిదర్శనం…

బాల్క సుమన్ మాట్లాడిన మాటలు వెంటనే వెన్కి తీసుకోవాలి..

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

ఫిబ్రవరి 05, నల్లా సమాచార్ న్యూస్ / శేరిలింగంపల్లి :

(ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి 9849396606)

రేపు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు అన్ని డివిజన్ పరిధిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలి అనంతరం పోలీస్ స్టేషన్లలో చర్యలు తీసుకునేలా కంప్లెట్ చేయాలని పిలుపునిచ్చారు.. శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కార్యాలయంలో జగదీశ్వర్ గౌడ్ వారు మాట్లాడుతూ..బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతున్నతీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేట్లు ఉంది అని అన్నారు. బాల్కసుమన్ సంస్కార హీనంగా మాట్లాడుతున్నారు అని బాల్కసుమన్ కు సీఎం రేవంత్‌ రెడ్డిపై విమర్శలు చేసే అర్హత లేదు అని తెలిపారు. బీఆర్ఎస్ నాయకుల తీరు…ప్రజలు అసహ్యించుకునేట్లు ఉంది అని పేర్కొన్నారు. బాల్క సుమన్ లాంటి నాయకులు మాట్లాడే బాష తీరు మారకపోతే ప్రజలు తగిన బుద్ధి చెపుతారు అన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకుల వ్యవహారాలు చూస్తుంటే… త్వరలోనే జరగబోవు పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తిరగబడుతారని, ఇప్పటికైనా పద్ధతులు మార్చుకొని ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించాలిని జగదీశ్వర్ గౌడ్ సూచించారు.

Leave A Reply

Your email address will not be published.