ప్రజాపాలనకు నిదర్శనంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పరిపాలన: వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

ప్రజాపాలనకు నిదర్శనంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పరిపాలన:వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

ప్రజాపాలనకు నిదర్శనంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది..

డిసెంబర్ 27, నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) శేరిలింగంపల్లి నియోజకవర్గం :

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు.. 6పథకాల అమలును స్వాగతిస్తూ సోనియా గాంధీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఏ.రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు వి.జగదీశ్వర్ గౌడ్, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్..

జోనల్ కార్యాలయం, వెస్ట్ జోన్

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే 6పథకాల అమలుకు శ్రీకారం చుటిందని,పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా నిలుస్తుందని అన్నారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు రేపు డిసెంబర్ 28 నుంచి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలకు అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతున్నదని,ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో రేపటినుండి జనవరి 6వ తేదీ వరకు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు..

కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,ప్రతి కార్యకర్త ప్రతి వ్యక్తికి సహకరించాలని మీమీ బస్తి,కాలనీ,ఏరియాలోని ప్రజలకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుండి అప్లికేషన్స్ కోసం అన్ని విధాలుగా సహకరించాలని ప్రతి ఒక్కరు ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేశారు..

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు జేరిపేటి జైపాల్, రఘునందన్ రెడ్డి, గఫుర్, సాంబశివరావు, నాగేశ్వరరావు, ఏకాంత్ గౌడ్, శ్రీకాంత్,  సయ్యద్ తహెర్ హుస్సేన్, అక్బర్, వేరేశం గౌడ్, శేఖర్ ముదురాజ్, కోటేశ్, ఏకే బాలరాజు, డివిజన్ అధ్యక్షులు మహిపల్ యాదవ్, సురేష్ నాయక్, భారత్ గౌడ్, షేక్ అలీ, మరేళ్ల శ్రీనివాస్, బాష్పక యాదగిరి, జంజీర్, హాఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ సునీత రెడ్డి, కల్పన ఏకాంత్ గౌడ్, శిరీష, లక్ష్మీ, శశిరేఖ, సీతమ్మ,తన్విర్, వహీదా, పార్వతి, ప్రమీల, మంజుల, ప్రవీనా, నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.