శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ భూమిని కాపాడే బాధ్యత తీసుకుంటాం..

-శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ భూమిని కాపాడే బాధ్యత తీసుకుంటాం..

-శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

-హైదరనగర్ డివిజన్ ఆదిత్య నగర్, అడ్డగుట్ట కాలనీ అసోసియేషన్ సభ్యులతో కాలనీలో ఉన్న పార్కులు మౌళికవసతుల అభివృద్ధిపై సమీక్ష సమావేశం

జనవరి 28, నల్లా సమాచార్ న్యూస్ / శేర్లింగంపల్లి : ఆదిత్య నగర్ మరియు అడ్డగుట్ట కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని, ట్రాఫిక్ వల్ల ఎదురవుతున్న ఇబంధులను, కమ్యూనిటీ హాల్ నిర్మాణం, అంబిర్ చెరువు, ప్రభుత్వ భూములు, కాలనీలో ఉన్న పార్కు స్థలాలు కబ్జా గురైన విషయాలను ఈరోజు కాలనీ అసోసియేషన్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఇంచార్జ్ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.. ప్రభుత్వ భూముల కబ్జాలకు పాల్పడితే పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, ఎవరైనా మా దృష్టికి తీసుకురావాలన్నారు. నేడు మనం చేసే పనులు రాబోయే తరాలకు మేలు జరిగేలా ఉండలని,నా దృష్టికి వచ్చే ప్రతి అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు మంచి జరిగేలా చూస్తానని తెలిపారు.. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్ రెడ్డి,భారత్, భగవాన్, నాయుడు, ఎస్.వి.రావు, సాయి రాజు, వాసు, లక్ష్మణ్ రావు, వెంకటేష్, రంగనాధ్ రాజు, నాగేశ్వరరావు రావు, నల్ల సంజీవ రెడ్డి, వీరేందర్ గౌడ్, జివి రెడ్డి, రాజీ రెడ్డి, శ్రీకాంత్, ఫాయజ్, ప్రభాకర్, భీమ్ రావు, రాజు, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.