శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ పక్క ప్రణాళికతో ముందుకు సాగుతుంది..

శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ పక్క ప్రణాళికతో ముందుకు సాగుతుంది..

జనవరి 11, నల్లా సమాచార్ న్యూస్ / శేర్లింగంపల్లి : తెలంగాణ రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి, ఐటీ, పరిశ్రమలు మరియు అసెంబ్లీ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుని శేరిలింగంపల్లి అభివృద్ధి విషయమై మర్యాదపూర్వకంగా కలిసిన శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదరేశ్వర్ గౌడ్..

ఈ సంధర్బంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాలలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను మంత్రి కి తెలియచేసారు. దానికి మంత్రి సానుకూలంగా స్పందించి, తొందర్లోనే సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత జిల్లా మంత్రి పర్యవేక్షణలో నిధులు మంజూరు చేస్తామని, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్ లను సమన్వయ పరుస్తూ ముందుకు సాగుతామని మంత్రిగారు తెలిపారు..

Leave A Reply

Your email address will not be published.