మంచిర్యాలలో రోజు రోజుకి ఖాళీ అవుతున్న బిఆర్ఎస్
బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వరదల సాగుతున్నా చేరికలు..
నవంబర్ 12, నల్లా సమాచార్ న్యూస్ / మంచిర్యాల :
మంచిర్యాల మున్సిపాలిటీలోని వివిధ వార్డులకు చెందిన బిఆర్ఎస్ పార్టీ యువకులు దాదాపు 250 మంది మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. శనివారం లక్షెట్టిపెట్ మండలం దౌడపెళ్లి నుండి 300 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు రోజు రోజుకు బి ఆర్ ఎస్ నియోజకవర్గంలో ఖాళీ అవుతుందని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ నా మీద నమ్మకంతో పార్టీలోకి వస్తున్న నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పకుండా న్యాయం చేస్తానని తెలిపారు పార్టీలో చేరిన అనంతరం నాయకులు మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణను అప్పుల తెలంగాణ, ఆత్మహత్య ల తెలంగాణ గా నిరుద్యోగుల తెలంగాణ గా మార్చిన ఘనత బిఆర్ఎస్ పార్టీదే అన్నారు. అందరికి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలుపిస్తామని తెలిపారు.