కాంగ్రెస్ పార్టీకి జీహెచ్ఎంసీ అభివృద్ధిపై స్పష్టమైన అవగాహన ఉంది,గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే కాంట్రాక్టర్లకు బిల్లులు అందలేదు

కాంగ్రెస్ పార్టీకి జీహెచ్ఎంసీ అభివృద్ధిపై స్పష్టమైన అవగాహన ఉంది గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే కాంట్రాక్టర్లకు బిల్లులు అందలేదు

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలే అవుతుంది..

నల్లా సమాచార్ న్యూస్ ( ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి)

కాంగ్రెస్ పార్టీకి జీ.హెచ్.ఎం.సి అభివృద్ధిపై స్పష్టమైన అవగాహన ఉంది..

గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కాంట్రాక్టర్లకు బిల్లులు అందలేదు..

వి.జగదీశ్వర్ గౌడ్,మాధాపూర్ డివిజన్ కార్పోరేటర్..

 

జి.హెచ్.ఎం.సి కౌన్సిల్ సమావేశం..

తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి 2 నెలలే అవుతుందని,కొంతమంది ప్రజా ప్రతినిధులకు స్పష్టమైన అవగాహన లేక గత 4 నెలలుగా పనులు జరగడం లేదు అని అనడంలో ఎంత మాత్రం నిజంముందని?,కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు మాధాపూర్ డివిజన్ కార్పొరేటర్,శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ..

 

ఈరోజు జి.హెచ్.ఎం.సి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి జీ.హెచ్.ఎం.సి అభివృద్ధిపై స్పష్టమైన అవగాహన ఉందని,శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై ఇప్పటికే ఇంచార్జ్ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని,పెండింగులో ఉన్న పనులు సంబంధిత అధికారులతో కలిసి పూర్తి చేసే విధంగా కృషి చేస్తామని,శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో అన్యాక్రాంతం అవుతున్న పార్క్ స్థలాలను కాపాడే బాధ్యత మేయర్ ,కమిషనర్ తీసుకోవాలని ఈ సందర్భంగా విన్నవించారు..

Leave A Reply

Your email address will not be published.