దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం..

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం..

-మెదక్ ఎంపీగా ఎన్నికైన ఇందిరా గాంధీ ఆ నాడు బి.హెచ్.ఈ.ఎల్, ఆర్డినెన్స్, బిడిఎల్ లాంటి అనేక కర్మాగారలు స్థాపించి ఆనాటి ఖైరతాబాద్ నియోజకవర్గ శేరిలింగంపల్లి ప్రజలకు వారి అభివృద్ధికి పరోక్షంగా కృషి చేసిన నాయకురాలు..

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తాం..

-తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్ర నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యంతోనే పేదలకు న్యాయం చేస్తాం..

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

జనవరి 12, నల్లా సమాచార్ న్యూస్ / శేర్లింగంపల్లి

ఈ రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని జగద్గిరిగుట్ట బస్ స్టాప్ నందు విగ్రహదాత జేరిపేటి జైపాల్ ఏర్పాటు చేయించిన ఇందిరా గాంధీ విగ్రహాన్ని కుత్బులపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హనుమంతు రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నర్సారెడ్డి భూపతి రెడ్డి, రఘునందన్ రెడ్డి,మాజీ కార్పొరేటర్ భాను ప్రసాద్,మహిపల్ యాదవ్, గొట్టిముక్కల వెంకటేశ్వర రావు, సి.పి.ఐ కార్యదర్శి ఏసురత్నం, వివేకానంద నగర్ కాంటెస్టడ కార్పొరేటర్ బాష్పక నాగమణి తో కలిసి ఆవిష్కరించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..దేశానికి ఇందిరమ్మ చేసిన సేవలు మరువలేనివి అని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, ఇందిరమ్మ రాజ్యం వల్లే తెలంగాణలోని మారుమూల పల్లెల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి నిలువ నీడనిచ్చిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. గిరిజనులు, దళితులు, పేదలకు 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పంచి ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా కాంగ్రెస్ చేసిందన్నారు.

నాగర్జునసాగర్, శ్రీశైలం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు కట్టి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన పార్టీ కాంగ్రెస్సేనని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల్లో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ అని,హైదరాబాద్ లో ఓఆర్ఆర్,ఫ్లై ఓవర్లు,మెట్రో రైలు సౌకర్యం,ఐటీ,ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్ అని వివరించారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ.ఏ.రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర నాయకులు నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చామని..ఆ దిశగా అడుగులు వేస్తున్నామని.సంపదను సృష్టించి దానిని పేదలకు పంచుతామని,కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మహాలక్ష్మిని అమలు చేశామని వెల్లడించారు,రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు గుర్తు చేశారు.త్వరలోనే ఇతర పథకాలు కూడా అమలు చేసి ప్రజలకు మేలు చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు బాష్పక యాదగిరి,ముకన్న,అల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు మరేళ్ల శ్రీనివాస్,మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు సురేష్ నాయక్, సాంబశివరావు, ఎస్.సి సెల్ నాయకులు నడిమేటి కృష్ణ,నాగుల మల్లేష్, పరుశురాములు, శ్రీకాంత్, రమేష్, దుర్గన్న, విరేశ్సుధాకర్, రాజు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజన్, దుర్గేష్, సాయి కిశోర, సైదులు, శివ, కిషన్ రావు, రవి, రూబెన్, ఎన్.ఎస్.యూ.ఐ నాయకులు సామ్సన్, దుర్గాప్రసాద్, శశిధర్, యాదయ్య గౌడ్, రెహ్మాన్, బసంత్ రాజ్, గోపాల్, ప్రభాకర్, రవి కుమర్, భారత్ గౌడ, వెంకటన్న, సుధాకర్, మహిళలు విజయ, స్వస్తి, లక్ష్మీ, స్వప్న తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.