పాలక పక్షంలో గుబులు ఒకే వేదిక పై కాంగ్రెస్ కుటుంబ సభ్యులు

పాలక పక్షంలో గుబులు ఒకే వేదిక పై కాంగ్రెస్ కుటుంబ సభ్యులు

రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం

ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ కి రుణపడి ఉంటా – జగదీశ్వర్ గౌడ్

మచ్చలేని నాయకుడు శేరిలింగంపల్లికి అవసరం 

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

భారీ మెజార్టీతో జగదీశ్వర్ గౌడ్ ని గెలిపిస్తాం – రఘునాథ్ యాదవ్

 

నవంబర్ 11 నల్లా సమాచార్ న్యూస్ / శేరిలింగంపల్లి :

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒకే వేదికపై అందరూ కలవడం శుభ పరిణామంగా భావిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను రఘునాథ్ యాదవ్ నీ ఎల్లప్పుడూ నా కుటుంబ సభ్యులుగా తోబుట్టువుగా చూసుకుంటాను ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా నవంబర్ 30 తారీఖు వరకు పనిచేయాలని రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకుంటామని శేరిలింగంపల్లి నియోజకవర్గం లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శనివారం నాడు కొండాపూర్ లోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ రఘునాథ్ యాదవ్ కార్యాలయం లో ఏర్పాట్లు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశం లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రo లో కాంగ్రెస్ పార్టీ అధికారం లో కి రావడం ఖాయమని, ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. రఘునాథ్ యాదవ్ పెద్ద మనసుతో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కి కృషి చేయడం అభినందనీయమని, అయన సేవలను కాంగ్రెస్ పార్టీ గుర్తుస్తుందని, తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ఏ ఐ సి సి అధికార ప్రతినిధి శ్యామ మహమ్మద్ మాట్లాడుతు.. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ కి తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ని గెలిపించాలని పిలుపిచ్చారు.

 

రఘునాథ్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గెలుపునకు శ్యాయశక్తుల కృషి చేస్తానని 20 సంవత్సరాల రాజకీయం అనుభవం ఉన్న మచ్చలేని నాయకుడి గా హైకోర్టు లాయర్ గా కౌన్సిలర్ మెంబర్గా బలమైన నేత గా శేరిలింగంపల్లి నియోజకవర్గం లో జగదీశ్వర్ గౌడ్ కి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని ఎన్నో కుటుంబాలకు సేవలు చేస్తూ తోడునీడగా ఉన్నారని కాంగ్రెస్ అధిష్టానం పిలిచి టికెట్ ఇవ్వడం సంతోషం వ్యక్తం చేస్తున్నానని భారీ మెజార్టీతో అన్నను గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో మాజీ చైర్మన్ నర్సింగ్ రావు, కొడిచర్ల టి. కృష్ణ, భానుప్రసాద్, మహిపాల్ యాదవ్, నర్సింహా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.