ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి – జగదీశ్వర్ గౌడ్

ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి – జగదీశ్వర్ గౌడ్

ప్రతి ఇంటి బిడ్డగా ఆదరించి అపూర్వ స్వాగతం పలుకుతున్నారు

నవంబర్ 12, నల్లా సమాచార్ న్యూస్ / శేర్లింగంపల్లి :

కాంగ్రెస్ పార్టీ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై నమ్మకంతో మాతృ శ్రీ నగర్ కాలనీలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేసి నన్ను ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు కాలనీలో నెలకొన్న సమస్యలను మీ ఇంటి బిడ్డగా మీ సేవకుడిగా ప్రతి ఒక్క సమస్యలను పరిష్కరిస్తానని మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓట్లు అడుగుతున్నానని ఒకసారి అవకాశం ఇచ్చి నన్ను గెలిపించాలని మాతృశ్రీ నగర్ కాలనీవాసులని జగదీశ్వర్ గౌడ్ కోరారు. ఆత్మీయ సమ్మేళనం ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు వచ్చి కుల మత అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరు స్నేహభావంతో కుటుంబ సభ్యులుగా కలిసి ఉంటారని మీ ఇంటి కుటుంబ సభ్యుడిగా నన్ను ఆత్మీయ సమ్మేళనానికి పిలవడం మీ అందరితో కలవడం సంతోషంగా ఉందని జగదీశ్వర్ గౌడ్ సంతోషం వ్యక్తపరిచారు,ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.