ప్రజల పాలనకు నిదర్శనం కాంగ్రెస్ ప్రభుత్వం..

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్

ప్రజల పాలనకు నిదర్శనం కాంగ్రెస్ ప్రభుత్వం..

ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, మీ వెంటా ఉంటా మీ అడుగులో అడుగై నడుస్తా..

ప్రజలు ప్రభుత్వం మధ్య సమస్యలను తీర్చే వారధిగా నిలుస్తా…

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

ఫిబ్రవరి 11, నల్లా సమాచార్ న్యూస్ / శేర్లింగంపల్లి :

ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందనగర్ భవనిపురం బస్తీలో పర్యటించిన స్థానికంగా ఉన్న సమస్యలపై స్థానిక బస్తి సభ్యులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు..

ప్రజల పాలనకు నిదర్శనం కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని, రంగారెడ్డి జిల్లా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు దృష్టికి ప్రతి సమస్యను తీసుకువెళ్లి పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తామని తెలిపారు..

ఈ సందర్భంగా ఇళ్ల పట్టాలు,అండర్ గ్రౌండ్ డ్రైనేజ, నీటి,సీసీ రోడ్డు సమస్యలు స్థానికులు శేరిలింగంపల్లి ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలు ప్రతిఒక్కటి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రజల మధ్యనే ఉంటూ మీ సమస్యలను ఒక్కొక్కటిగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తామని తెలిపారు..

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సునీత రెడ్డి, శేరిలింగంపల్లి నాయకులు ప్రభాకర్ రెడ్డి, గఫూర్, చందర్ రావు, పొచన్న, సైఫుల్లాహ్ ఖాన్, వేణు, రాము, ఆయాజ్ ఖాన్, శ్రీకాంత్, అనిల్ కుమార్, పాపయ్య, పోచయ్య, మల్లేష్, రమేష్, నర్సింహ, శ్యామ్, ఆఫ్రోజ్, రాజ్ కుమార్, మహిళ నాయకురాలు లలిత రాణి, సరితా, బుజ్జమ్మ, శ్రావణి తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.