కొమ్మూరి గెలుపు కోరుతూ మహిళ కాంగ్రెస్ ప్రచారం
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాల ప్రచారం
నవంబర్ 13, నల్లా సమాచార్ న్యూస్ / జనగామ :
ఈరోజు జనగామ పట్టణం 2వ వార్డు మరియు 3వ వార్డులలో మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గెలుపు కోసం గడప గడపకు తిరుగుతూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రచారం నిర్వహించిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కోడలు కొమ్మూరి దివ్య రెడ్డి. వారితో పాటు జనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బడికె ఇందిరా, జనగామ జిల్లా మహిళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనగామ మున్సిపల్ కౌన్సిలర్ వంగాల కళ్యాణి, 9వ వార్డు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మునిబేగం, జనగామ జిల్లా కాంగ్రెస్ నాయకురాలు కుకట్లా సుజాత, మరియు సురేందర్ రెడ్డి , కోట నాయక్, మచ్చ ప్రవీణ్, కందడి సంజీవ రెడ్డి, గజ్జుల నితీష్ రెడ్డి, భాస్కర్ వార్డు మహిళలు తదితరులు పాల్గొన్నారు