భువనగిరి పార్లమెంట్ ఎంపి టికెట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డికే కేటాయించాలి

భువనగిరి పార్లమెంట్ ఎంపి టికెట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డికే కేటాయించాలి

ప్రతిసారి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సీటు ఉమ్మడి నల్గొండ జిల్లా వాళ్లకు కేటాయించడం తగదు

జనగామ నియోజకవర్గం నుండి ముక్తకంఠంతో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏకాభిప్రాయంతో ఒక తీర్మానం చేసి ఏఐసిసి మరియు పిసిసికి మెమొరాండం

 జనగామ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

 డిసెంబర్ 30, నల్లా సమాచార్ న్యూస్ / జనగామ

ఈరోజు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మరియు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బనుక శివరాజ్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కి భువనగిరి పార్లమెంట్ ఎంపి టికెట్ కేటాయించాలి కోరారు. ఈ సమావేశనికి ముఖ్య అతిథిగా పిసిసి మెంబర్ చెంచారపు శ్రీనివాస్ రెడ్డి పాల్గొని పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కే కేటాయించాలని అధిష్టానాన్ని కోరుతున్నాము అని అన్నారు. జనగామ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే స్థానికుడైన కుమ్మరి ప్రతాప్ రెడ్డి వల్లనే అవుతుందని గతంలో ఆయన చేసిన రిజర్వాయర్లు పాఠశాలల కోసం ఇచ్చిన భూమి తన సొంత ఖర్చుతో అనేక అభివృద్ధిలో చేశారని గుర్తు చేశారు అదేవిధంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. కార్యకర్తల అభివృద్ధి కోసం పాటుపడతారని అన్నారు నిత్యం ప్రజల మధ్య ఉంటూ అందరికీ అందుబాటులో ఉన్న నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అని అన్నారు.

అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎంపి టికెట్ ఎవ్వరికీ కేటాయించినందున మరియు ప్రతి ఎన్నికల్లో నల్లగొండ జిల్లా వారికే కేటాయిస్తునందున ఈసారి భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నీ కోరుతున్నాము అని అన్నారు. ఒకవేళ అవసరం అనుకుంటే జనగామ నియోజకవర్గం నుండి ముక్తకంఠంతో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏకాభిప్రాయంతో ఒక తీర్మానం చేసి ఏఐసిసి మరియు పిసిసికి మెమొరాండం పంపిస్తామని అన్నారు.

•ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వేమల్ల సత్యనారాయణ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సర్వాల నర్సింగరాజు, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి శ్రీనివాస్ రెడ్డి , మాజీ కౌన్సిలర్ మేడ శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెంచారపు బుచ్చిరెడ్డి ,PACS డైరెక్టర్ వంగాల మల్లారెడ్డి, డీసీసీ కార్యదర్శి గంగం నర్సింహా రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెంచారపు కరుణాకర్ రెడ్డి ,రంగరాజు ప్రవీణ్ కుమార్, లింగాల నర్సిరెడ్డి ,గుండా శ్రీధర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ తుపాకుల రాములు, వంశీధర్ రెడ్డి, సుదగొని కృష్ణ,గుజ్జుల మధు, తొట్టె కృష్ణ,హనుమత్ రెడ్డి, గొలుసుల దుర్గేష్ ,సంకటి యాదగిరి, బబ్బురి సంతోష్,సంజీవ్ రెడ్డి,కోలిపాక కృష్ణ,ముక్కెర యాదగిరి, శివయ్య,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి క్రాంతి,యూత్ కాంగ్రెస్,యూత్ కాంగ్రెస్ జనగామ మండల కోఆర్డినేటర్ లు బనుక ప్రభాకర్,పిడుగు రమేష్, యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ప్రకాష్ యాదవ్,యూత్ కాంగ్రెస్ నాయకులు గందమల కమలాకర్,నీల రజినీ కాంత్, బచన్నపేట యూత్ కాంగ్రెస్ మండల కోఆర్డినేటర్ ఎద్దు హరీశ్,కొర్నే పాక విష్ణు, బైరగొని రఘు,బత్తుల శ్రీనివాస్, మచ్చ ప్రవీణ్, పవన్ రాజు, చిన్న, బి మల్లేష్, ఏ సురేష్ గౌడ్, బి స్వామి, తోగరు పృథ్వీ రాజ్, నాగరాజ్, అరవింద్ గౌడ్, సమ్మయ్య, రాజు యాదవ్, గణేష్, ప్రదీప్, హరీష్, సురేష్, సతీష్, రాజేష్, శ్రీను, నవీన్ మరియు వివిధ మండలాల నాయకులు ,కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.