కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి..

 

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా ప్రతిఒక్క కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిలాగా పని చేయాలి..

కొండాపూర్ డివిజన్ కొత్తగూడా కమ్యూనిటీ హాల్,అంజయ్య నగర్ వార్డ్ కార్యాలయం మరియు మాదాపూర్ కమ్యూనిటీ హాల్ నందు సంక్షేమ పథకాల కొరకై ఏర్పాటు చేయసన దరఖాస్తు కేంద్రాల పరిశీలించిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్..

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా ప్రతిఒక్క కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిలాగా పని చేయాలని,ప్రతి కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్త పర్యవేక్షించాలని పిలుపునిచ్చారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

నేటి నుండి 6 జనవరి 2024 తేదీ వరకు కేంద్రాలలో ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలను సంబందించిన అన్ని రకాల ఫార్మలు అందుబాటులో ఉంచి,వాటికీ సంబందించిన అధికారులు,మా సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని,ప్రజలందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా,ఇందిరమ్మ ఇండ్లు,గృహ జ్యోతి,చేయూత గ్యారంటీల లబ్దికొరకు అప్లై చేసుకోవచ్చు.

మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రూ.2500 ఆర్థిక సహాయం,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్‌‌,ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇల్లు లేనివారికి ఇంటి స్థలం,5 లక్షల రూపాయల సాయం,ఉద్యమకారులు,అమరవీరుల కుటుంబాలకు 250 చదరపుగజాల ఇంటి స్థలం,గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్,చేయూత పథకం కింద నెలకు 4000 రూపాయల పింఛన్ మరియు దివ్యాంగులకు 6000 రూపాయల పింఛన లబ్దికొరకు అప్లై చేసుకోవచ్చు.

 

ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు జంగం గౌడ్,నీలం లక్ష్మీనారాయణ ముదిరాజ్,కృష్ణ గౌడ్,నందు,విక్రమ్ చారి,కొండల్ రెడ్డి,హనుమంత,ఇంరోజ్,మహిళలు లక్ష్మీ,శ్రావణి తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.