ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న జగదీశ్వర్ గౌడ్ కుమార్తె, కుమారుడు

ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న జగదీశ్వర్ గౌడ్ కుమార్తె, కుమారుడు

శేర్లింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ కి తమ అమూల్యమైన ఓటు వేయాలని విన్నపం

నవంబర్ 13, నల్లా సమాచార్ న్యూస్ / శేర్లింగంపల్లి :
ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం 108 మియాపూర్ డివిజన్ పరిధిలోని బి కే ఎంక్లేవ్, ప్రజాశల్టర్,రెడ్డి ఎంక్లేవ్,సాయి జ్యోతి నగర్, సాయిరాం కాలనీలలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ కుమార్తె హారిక, కుమారుడు వైభవ్ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారెంటీ పథకాలను వివరిస్తూ శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ కి తమ ఓటు వేయాలని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు ఐ ఎన్ టి యు సి నాయకులు స్థానిక కాలనీ వాసులు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.