సిఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడే హక్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేదు: మల్లు రవి మాజీ ఎంపీ, టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు

సిఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడే హక్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేదు మల్లు రవి మాజీ ఎంపీ టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు:మల్లు రవి, మాజీ పార్లమెంటు సభ్యులు టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు.

నల్లా సమాచార్ న్యూస్ ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి హైదరాబాద్:

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవితం తెరిచిన పుస్తకం.. అందుకే ప్రజలు ఆయనను విశ్వసించారు.

సీఎం రేవంత్ రెడ్డి అక్రమంగా సంపాదించారని కిషన్ రెడ్డి అనడం విడ్డురంగా ఉంది.

రేవంత్ రెడ్డి రాజకీయాలు మొదలు పెట్టినప్పటినుంచి ఎన్నడూ అధికార పార్టీ లో లేరు..

కిషన్ రెడ్డి ఇప్పటికి పలు సార్లు కేంద్ర మంత్రిగా ఎంపీ గా ఎమ్మెల్యే గా పని చేసారు .

రేవంత్ రెడ్డి స్వతంత్ర జడ్పీటిసి గా ఎమ్మెల్సీగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే గా ఎంపీగా, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ గా, టీపీసీసీ అధ్యక్షులుగా పని చేసి సీఎం గా అయ్యారు.

కేంద్రంలో పలు సార్లు మంత్రిగా పని చేసిన కిషన్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి అక్రమ సంపాదన చేస్తుంటే ఎందుకు విచారణ చేయలేదు.

పదేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్ అవినీతిపై ఎందుకు విచారణ చేయలేదు.

ఇద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం లేకపోతే అనేకసార్లు ఎంపీ నుంచి ప్రధాని మోడీ వరకు అంత కేసీఆర్ పై అవినీతి విచారణ ఎందుకు చేయలేదు

కేసీఆర్ ను కాపాడింది బీజేపీ కాదా, కేసీఆర్ బిడ్డ కవిత పై లిక్కర్ అవినీతి ఆరోపణలు ఉంటే అరెస్ట్ చెయ్యకుండా కాపాడింది ఎవరు మీరు కాదా…

రేవంత్ రెడ్డి పై మాట్లాడే హక్కు కిషన్ రెడ్డి కి లేదు ..

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీగా గా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటుంది.

సీఎం రేవంత్ రెడ్డి మొదటి రోజే కాళేశ్వరం ప్రాజెక్టు పై జ్యూడిషియల్ విచారణ కు ఆదేశించిన విషయం కిషన్ రెడ్డి కి తెలియదా .!

Leave A Reply

Your email address will not be published.