వెల్లువలా కాంగ్రెస్ లోకి వలసలు

-సునిత సమక్షంలో హస్తం గూటికి చేరిన శంకర్ పల్లి మున్సిపల్ ఐదు మంది కౌన్సిలర్లు

వెల్లువలా కాంగ్రెస్ లోకి వలసల

-సునితమ్మ సమక్షంలో హస్తం గూటికి చేరిన శంకర్ పల్లి మున్సిపల్ ఐదు మంది కౌన్సిలర్లు

-కాంగ్రెస్ కందువకప్పుకున్న100 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు

 

ఫిబ్రవరి 26, నల్లా సమాచార్ న్యూస్ / వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ లోకి వలసల వరద కొనసాగుతుంది. సోమవారం చేవెళ్ల పార్లమెంటరీ కాంగ్రెస్ నాయకురాలు, జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి సమక్షంలో శంకర్ పల్లి మున్సిపల్ కి చెందిన ఐదు మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు సంధ్యా అశోక్, సంతోష్, శ్రీనివాస్ రెడ్డి, రాములు, వెంకట్ రాంరెడ్డి, వంద మంది బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకునున్నారు. చేరిన వీరు తామంతా సునితమ్మ వెనకాల నడుస్తామని వారంతా ప్రతినబూనారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమవ్యక్తం చేశారు. ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కోరారు. రేపు జరిగే ప్రియాంక గాంధీ బహిరంగ సభకు భారీగా జనం తరలిరావాలని పిలునిచ్చారు.

 

Leave A Reply

Your email address will not be published.