చేవెళ్ల పార్లమెంట్ మహిళా రివ్యూ సమావేశానికి కదిలిన శేరిలింగంపల్లి మహిళా నాయకురాళ్ళు, కార్యకర్తలు

చేవెళ్ల పార్లమెంట్ మహిళా రివ్యూ సమావేశానికి కదిలిన శేరిలింగంపల్లి మహిళా నాయకురాళ్ళు కార్యకర్తలు

 

 

ఛలో చేవెళ్ల..

నల్లా సమాచార్ న్యూస్ ( ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి 9849396606)

మూడు రంగుల జెండా పట్టిన శేరిలింగంపల్లి మహిళా దళం..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అనుములు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ మహిళా రివ్యూ మీటింగ్ కు కదిలిన శేరిలింగంపల్లి మహిళా నాయకులు,కార్యకర్తలు..*

 

ఈరోజు నల్లగండ్ల గ్రామం నుంచి బస్సులో బయలుదేరిన కార్యకర్తలను జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ..

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మహిళలకు పెద్ద పీట వేస్తుందని,మంత్రివర్గంలో కూడా వారికి సముచిత స్థానం కల్పించిందని,మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే స్ఫూర్తితో పని చేసి విజయఢంకా మోగించేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు,ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ మహిళా సమావేశానికి కదిలిన శేరిలింగంపల్లి మహిళ నాయకులను,కార్యకర్తలు రానున్న ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ జెండాను చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో ఎగిరిస్తామని తెలిపారు..

 

ఈ కార్యక్రమంలో మహిళలు,నియోజకవర్గ నాయకులు,డివిజన్ అధ్యక్షులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.