బాబుకు షాక్ …14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
సెప్టెంబర్ 10, నల్లా సమాచార్ న్యూస్ / విజయవాడ :
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలం లేపిన స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసిబి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈనెల 22 వరకు మాజీ ముఖ్యమంత్రి రిమాండ్ లో ఉండనున్నారు. ఈ సందర్భంగా బాబు రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించనున్నారు. ఈ కేసు వివరాలు అందులో చంద్రబాబు పాత్రను కోర్టుకు సిఐడి వివరించింది. ఆర్థిక నేరాల నిందితులకు బెయిల్ ఇవ్వకూడదని కోరింది. వారి వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి చంద్రబాబుకు రిమాండ్ విధించారు. కాగా బాబు అరెస్టుపై నిబంధనలు పాటించలేదన్న టిడిపి లాయర్ల వాదనలను తోసిపుచ్చారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన బాబు అనేక కేసుల్లో కోర్టు లో నిరూపితం కాకుండా బయట పడ్డారు. మొదటి సారి రిమాండ్ లో ఉండడం గమనార్హం.